Saturday, 19 November 2016

దీపావళి

భార్య : కారణం లేకుండా తాగను అన్నారు కదండీ.. మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు... ??
భర్త : దీపావళి వస్తుంది కదా.. అందుకే తాగాను... 
భార్య : అయితే దానికి  తాగడానికి సంబంధం ఏంటి (కోపంగా )
భర్త : పిల్లలు రాకెట్ కాల్చడానికి సీసా మీ బాబు తెచ్చిస్తడా

పెళ్ళి - జైలు

శ్రీలత అర్ధరాత్రి మెలుకువచ్చి చూస్తే, భర్త రవి పక్కనలేడు, ఆందోళనగా అన్నీ గదులూj😴 చూసి, చివరకు వంటగదిలో కి వెళితే, ఆక్కడ దిగులుగా, శున్యంలోకి చూస్తూ కంట్లో కన్నీరుతో కనిపించాడు.
శ్రీ భయపడి, రవిని పలకరించింది..
శ్రీ : ఏమండి? ఏమైంది?
రవి : శ్రీ, 7 యేళ్ళ క్రితం, మనిద్దరం పార్కులో ప్రేమించుకొంటుంటే, మీ అన్న చూసి, మీనాన్నకు చెప్పాడు..
శ్రీ : అవునండీ, నాకు జ్ఞాపకం ఉంది.
రవి : అది తెలిసిన మీనాన్న, కత్తి పట్టుకొచ్చి, మా అమ్మాయిని చేసుకుంటావా, లేక పోలిసులతో   చెప్పి జైలుకు పంపించనా అని అడిగాడు.
శ్రీ : అవునండీ..అయితే?
రవి : జైలు అనేసరికి భయముతో నిన్ను చేసుకున్నాను, అదే జైలు కెళ్ళుంటె, ఈరోజుతో నాకు విడుదల అయ్యేది కదా.....అని భోరున ఏడ్చాడు.
శ్రీ : ఆ!...

సంతోషం

నేను నా స్నేహితుడ్ని అడిగా, నీ వైవాహిక జీవితం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? అని.

అతను చెప్పాడు, "బాధ్యతల్ని ఇద్దరు సమానంగా, ప్రేమ గౌరవం తో పంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య ఉండదు.

"కాస్త వివరంగాచెప్పు" అని అడిగాను.

అతను చెప్పాడు "మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలకి నేను నిర్ణయం తీసుకుంటాను, చిన్న చిన్న సమస్యలకి మా ఆవిడ నిర్ణయం తీసుకుంటుంది. ఒకరి నిర్ణయాలలో ఒకరం తలదూర్చం".

అయినప్పటికీ నా మనసు అంగీకరించలేదు. "కొన్ని ఉదాహరణలు ఇవ్వు" అని మళ్ళీ అడిగాను.

అతను చెప్పాడు "చిన్న సమస్యలు అంటే ఏ కారు కొనాలి, ఎంత డబ్బు దాయాలి, షాపింగ్, సూపర్ మార్కెట్ కు ఎప్పుడువెళ్ళాలి, సెలవులకి ఎక్కడికెళ్ళాలి, ఎప్పుడువెళ్ళాలి, ఏ సోఫా, ఏసి, ఫ్రిడ్జ్ కొనాలి, నెల ఖర్చులు, పనిమనిషిని ఉంచాలా లేదా, మొదలైన అన్ని నిర్ణయాలు మా ఆవిడ తీసుకుంటుంది. నేను దానికి ఒప్పుకుంటాను.

"మరి నీ పాత్రేమిటి?" అని అడిగాను.

అతను చెప్పాడు "నేను పెద్ద పెద్ద సమస్యలకు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాను. అవి, భారత్ పాకిస్థాన్ తో యుద్ధం చేయాలా వద్దా, ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయాలా వద్దా, బలూచిస్తాన్ స్వాతంత్ర్య దేశంగా ఏర్పడాలా వద్దా, ధోని క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్ కావాలి, సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్ళి చేసుకోవాలి మొదలైనవి.
నీకు తెలుసా! ఈ నా నిర్ణయాలను  నా భార్య ఎప్పుడూ వ్యతిరేకించదు.

whatsapp

అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త.
మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి... 

భర్త:- యేమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్?

భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ) 

భర్త:- ఏమి తీసేసావ్?

భార్య:-మీ సెల్ ఫోన్ వాట్సప్ లో మిమ్మల్ని "వైరస్" గ్రూప్ నుంచి తీసేసాను.

భర్త:- నీ బొంద అది “VIRUS” గ్రూప్ కాదే “VIRA’S” గ్రూప్. వీర రాఘవయ్య స్కూల్. అది మా టెంత్ క్లాస్ బ్యాచ్ మేట్స్ గ్రూప్. 

భార్య:-ఏమో నాకేమి తెలుసు? మొబైల్ లో వైరస్ వుండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-ఇంకా ఏమి తీసేసావ్?

భార్య:- “N.V.” గ్రూప్ నుంచి కూడా తీసేసాను.

భర్త:- ఓసి నీ మొఖం మండా !!! “N.V.” అంటే “నూకల వెంకటరత్నం కాలేజ్”. అది మా ఇంటర్ బ్యాచ్.

భార్య:-ఏమో నాకేమి తెలుసు? నాన్ వెజ్ జోకులు వుండకూడదు కదా! అందుకని తీసేసాను.

భర్త:-అంతేనా ఇంకా ఏమన్నా తీసేసావా?

భార్య:-"గాలి" గ్రూప్ నుంచి కూడా తీసేసాను. 

భర్త:- ఓసి నీ అయ్యా అది !!! “గాలి చిన వెంకటేశ్వర్లు కాలేజ్”. అది మా ఇంజినీరింగ్ బ్యాచ్. 

భార్య:-ఏమో నాకేమి తెలుసు? గాలి కబుర్లు చెప్పుకోకూడదు కదా! అందుకని తీసేసాను. 

భర్త:-ఓసి నీ సిగ తరగా!!! అసలు ఇవన్నీ చేయటానికి నీకు నా మొబైల్ పాస్ వర్డ్ ఎలా దొరికింది? 

భార్య:-మీ పేరు పెట్టా, నా పేరు పెట్టా, మీ అమ్మ పేరు పెట్టా, మీ నాన్న పేరు పెట్టా, మన అమ్మాయి పేరు పెట్టా, ఎన్ని ట్రై చేసినా కుదరలేదు.

భర్త:- మరి ఎలా తెరిచావే తల్లీ?

భార్య:-చివరి ప్రయత్నంగా మన పని మనిషి "సుందరి" పేరు నొక్కా!!! దెబ్బకి తెరుచుకుంది రా సచ్చినోడా 

Friday, 11 November 2016

భయంతో

సుబ్బులు : ఆ దొంగ మీ ఉంగరం, గడియారం, పర్స్  దోచుకొని వెళ్లిపోతుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉన్నారండి? కనీసం అరిస్తే ఇరుగు పొరుగు ఎవరైనా వచ్చేవాళ్ళు కదా?
అప్పారావు : ఆ, నోరు తెరిస్తే లోపలున్న రెండు బంగారు పళ్ళు కూడా పీక్కు పోతాడని భయమేసిందే సుబ్బులు.
ఆఆఆఆఅ..........................

వెధవ

అప్పారావు :(సుబ్బారావుతో):ఒరేయ్! "You are a fool" అంటే అర్థం చెప్పరా?
సుబ్బారావు :"నువ్వు ఒక వెధవవి" అని
అప్పారావు :అలా తిట్టవద్దురా సుబ్బారావు.
ఆఆఆ...................

తినడం

చింటూ(బంటి తో): చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలి రా?
బంటి : తీపి తినడం.

మట్టి బుర్ర


భర్త (భార్యతో): నా అభిమాన హీరో సినిమాలన్నీ నేను మూడేసి సార్లు చూస్తుంటాను తెలుసా?
భార్య : ఆశ్చర్యమేముంది, మీకు ఏది ఒకసారి చెపితే అర్థం కాదుగా !

నిజమైన పతివ్రత


జీవిత సత్యం.2

హారతి వెలిగించాక కాంతి...

అమ్మాయిని ప్రేమించాక మనఃశాంతి ఎక్కువ సేపు ఉండవు ...

అయ్యేవరకూ

కొత్తగా పెళ్ళయిన భర్త : మీఅమ్మ,నాన్న,చెల్లెళ్ళు,వదినలు,అన్నలువాళ్ళ పిల్లలు...ఎపుడు ఊరికెళ్తారు..??

భార్య:: మీకు ఐదులక్షలు కట్నం ఇచ్చారుగా..?

భర్త:: ఆ ఇస్తే..??

భార్య:: అది అయిపోయేవరకు ఉంటారట..!!

జీవిత సత్యం

దోమ కుడితే బ్లడ్ పోతుంది ....

అదే ప్రేమ పుడితే బ్రెయిన్ పోతుంది ...

పెళ్ళాం పుట్టుంటికి వెళ్తే


పరుగు

మీ భార్య ఎంత వేగంగా పరిగెత్తుతుందో పరిక్షించాలంటే గట్టిగా "పాలు పొంగుతున్నాయి" అని అరవండి ...

మీ భర్త ఎంత వేగంగా పరిగెత్తగలడో పరిక్షించాలంటే "మొబైల్ మోగుతుంది ఎత్తమంటారా " అని అరవండి ...

మౌనం


భార్య: ఏమండీ నా జుట్టు కొంచెం క‌త్తిరించుకోవాలా..?

భ‌ర్త: క‌త్తిరించుకో..

భార్య: ఎంత‌క‌ష్ట‌ప‌డి పెంచుకున్నానో..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఇప్పుడు అ‍ంద‌రూ క‌త్తిరించుకుంటున్నారు..అదే ఫ్యాష‌న్

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నేను క‌త్తిరించుకున్నాక‌ ఫ్యాష‌న్ మారిపోతే..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: మా ఫ్రెండ్స్ అంద‌రూ అంటుంటారు..నాకు చిన్న‌ జ‌డ‌నే బాగుంటుంది అని..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నాచిన్న‌ ఫేస్ కి చిన్న‌ జడ‌ బాగుండ‌దేమో అనిపిస్తుంది

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: చిన్న‌ జ‌డ‌యితే దువ్వుకోవ‌డం తేలిక‌.

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: పెద్ద‌ జ‌డ‌ని క‌ట్ చేస్తే పూలు పెట్టుకొవ‌డం కుద‌ర‌నిపిస్తూంది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఒక‌సారి experment చేసి చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: మ‌ళ్ళీ వెంట్రుక‌లు పెర‌గాలంటే చాలా టైం ప‌ట్టుద్ది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: లేక‌పోతే ఒక‌సారి క‌ట్ చేయించుకొని చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: ఒక‌వేళ‌ క‌ట్ చేయించుకున్నాక‌ బాలేక‌పోతే..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

:

:
:
:
:
:
:
:
:
ప్ర‌స్తుతం ఆభ‌ర్త‌ ఎర్ర‌గ‌డ్డ‌ మాన‌సిక‌ వైద్య‌శాల‌లో చికిత్స‌ పొందుతున్నాడు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
:అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
:అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:

డాక్ట‌ర్ల‌కి ఇప్ప‌టికీ అంతుచిక్క‌డం లేదు దేన్ని క‌త్తిరించ‌మంటున్నాడు..అంత‌లోనే వ‌ద్ద‌ని ఎందుకంటున్నాడ‌ని..
:
:
:
అత‌నిపై విదేశీ వైద్య‌బ్ర్రుందం యొక్క‌ ప‌రిశోధ‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి..

నీతి: ఒక్కోసారి మౌనం కూడా చాలా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తుంది..

*ప్ర‌జాప్ర‌యోజ‌నార్థం జారీ చేయ‌బ‌డింది..